News September 27, 2024
ఉదయం 8 గంటలకు సిరిమాను చెట్టుకు పూజలు

డెంకాడ మండలం పెదతాడివాడలో గుర్తించిన పైడితల్లి అమ్మవారి సిరిమాను చింతచెట్టు నగరానికి శనివారం తీసుకురానున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, చెట్టును కొట్టే కార్యక్రమం చేపడతారు. అనంతరం భారీ ఊరేగింపుతో ఆ చెట్లను పలు కూడళ్ళ మీదుగా పూజారి స్వగృహం ఉన్న హుకుంపేట తరలిస్తారు. అక్కడ నిపుణులైన వడ్రంగులు ఈ చెట్టును సిరిమానుగా మలిచే పని మొదలు పెడతారు.
Similar News
News March 2, 2026
VZM: ‘జనావాసాల్లో ఉంచితే కేసులు నమోదు చేస్తాం’

బాణసంచా నిల్వ, తయారీ, విక్రయదారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డిఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు. విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేయవద్దని, షాపులు-గోడౌన్ల వద్ద ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫైర్ అలారమ్స్, సురక్షిత వైరింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జనావాసాల్లో నిల్వ ఉంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
News March 1, 2026
విజయనగరంలో పోలీసుల ర్యాలీ

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకు పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, వారి రక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని డీఎస్పీ గోవిందరావు పేర్కొన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్‌ను ప్రతీ మహిళ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 1, 2026
VZM: ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి

ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కార్మికులు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి వినతిపత్రం అందించారు. 7300 మంది కార్మికులు ఉన్న థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టేట్ పబ్లిక్ సెక్రెటరీ అశోక్ డిమాండ్ చేశారు. అర్హత బట్టి రెగ్యులర్ చేయాలని కోరారు.


