News September 27, 2024

చింతలపూడి: చెరువులో శవమై తేలిన యువకుడు

image

చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన నాగరాజు (26)మంగళవారం ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతనే ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గురువారం స్థానిక పశువుల కాపరులు చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులకు సమాచారం అందించడంతో మృతదాహాన్ని బయటకు తీయగా నాగరాజుగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 17, 2025

యజమానులకు చెప్పకుండా సర్వే చేయవద్దు: JC

image

భూ యజమానులకు తెలియకుండా సర్వే చేయరాదని ప.గో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎంతమంది రైతులకు నోటీసులు ఇచ్చారో తెలుసుకున్నారు. నోటీసుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.

News February 17, 2025

ప.గో: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీనితో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

News February 17, 2025

మటన్ షాపులకు ఎగబడ్డ జనం.. విపరీతంగా పెరిగిన రేట్లు!

image

బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు అమాంతం పడిపోగా మటన్, రొయ్యలు, చేపల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ప.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కేజీ మటన్ గరిష్ఠంగా రూ.1200 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. చేపలు కేజీ సాధారణంగా రూ.130గా ఉంటే రూ.180కి, రొయ్యలు రూ.250గా ఉంటే రూ.350కి పెంచి అమ్మారు. ధర ఎక్కువయినప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వీటి కొనుగోళ్లకే మొగ్గు చూపారు. చికెన్ షాపులు వెలవెలబోయాయి.

error: Content is protected !!