News September 27, 2024
తొలి దశలో 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

TG: రాష్ట్రంలో తొలి దశలో భాగంగా 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తుందని సమాచారం. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, రెవెన్యూ సిబ్బందితో కలిపి గ్రామ కమిటీ వేయనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేనివారికి ఇవ్వనుంది.
Similar News
News February 3, 2026
సమీకృత వ్యవసాయ విధానాలు (మోడల్స్)

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి సమగ్ర వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.
News February 3, 2026
APPLY NOW: 28,740 ప్రభుత్వ ఉద్యోగాలు

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్‌తో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. APలో 1060, TGలో 609 పోస్టులు ఉన్నాయి. <
News February 3, 2026
SIRపై న్యాయపోరాటం కొనసాగుతుంది: మమత

SIR పేరుతో బెంగాలీలు, TMC నేతలను EC అధికారులు వేధిస్తున్నారని వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ ఆరోపించారు. ఢిల్లీలో CEC జ్ఞానేష్ కుమార్‌తో నిన్న భేటీ అయ్యి పలు విషయాలపై చర్చిస్తూ అర్ధాంతరంగా బయటకు వెళ్లారు. ‘ఓటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లక్షలాది ఓట్లు తొలగించారు. BJPకి EC IT విభాగంగా తయారైంది. దీనినే ప్రజాస్వామ్యం అంటారా?’ అని సంచలన కామెంట్లు చేశారు. SIRపై న్యాయపోరాటం కొనసాగుతుందని తెలిపారు.


