News September 27, 2024
నిజామాబాద్: కళ్లలో కారం చల్లి హత్య

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్‌లో <<14198416>>వియ్యంకుడిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కంజర్‌కు చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. కాగా ఇటీవల వర్ష ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం అల్లుడే అనే అనుమానంతో అతడి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో గోవర్ధన్ ఇంట్లో లేపోవడంతో అతడి తండ్రి కళ్లలో కారం చల్లి కర్రలతో కొట్టి చంపాడు.
Similar News
News January 21, 2026
NZB: 1931లో మున్సిపాలిటీ.. 2005లో కార్పొరేషన్

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్‌గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.
News January 21, 2026
నిజామాబాద్‌లో మున్సిపల్ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 44 వార్డుల రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఖరారులో నిబంధనలు పాటించలేదని పి.లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి మూడు రోజుల్లోగా రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా పడింది
News January 21, 2026
NZB: నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడి అరెస్టు

నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు NZB సైబర్ క్రైమ్ ACP వై. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడు టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి మాటలను నమ్మి, విదేశాల్లో అధిక జీతంతో ఉద్యోగాలు ఉన్నాయంటూ మోసాగిస్తున్నాడన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు.


