News September 27, 2024
దామరగిద్ద మండలంలో చిరుత సంచారం

దామరగిద్ద మండల పరిధిలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక రైతుల వివరాలు.. రెండు రోజుల క్రితం దామరగిద్ద తండాకు సమీపంలో గోన్యనాయక్ అనే రైతుకు చెందిన ఆవుదూడ పై దాడి చేసింది. గురువారం రోజు వత్తుగుండ్లకు చెందిన గొల్ల రాములు మేకలను మేపుతుండగా ఒక్కసారిగా మేకల గుంపుపై దాడి చేసి మేకను గాయపరిచింది. రైతు కేకలు వేయడంతో అడవిలోకి పారిపోయింది. పులిని బంధించాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News January 27, 2026
మోగిన నగారా.. MBNRలో 1,97,841 ఓట్లు

మున్సిపల్ కార్పొరేషన్ <<18974641>>ఎన్నికలకు నోటిఫికేషన్<<>> విడుదలైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లలో 1,97,841 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 96184 మంది ఉండగా మహిళా ఓటర్లు కూడా ఇంచుమించుగా అదే సంఖ్యలో ఉన్నారు. ఈ కార్పొరేషన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న ఫలితాలు వెలువడనున్నాయి.
News January 27, 2026
పాలమూరు: పేపర్లలో తప్పులుంటే అధికారులకు తెలపాలి: VC

పాలమూరు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మూడో సెమిస్టర్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ఉపకులపతి (VC) శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 27, 2026
MBNR: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గుతున్న చలి

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాజాపూర్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయి. జడ్చర్ల, మిడ్జిల్‌లో 15.1, భూత్పూర్‌లో 16.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రథసప్తమి ముగియడంతో ఇకపై ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.


