News September 27, 2024

18 నుంచి LLB రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయ ఐదేళ్ల LLB (రెండో సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ BSL సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 18న, 2వ పేపర్ అక్టోబర్ 22న, 3వ పేపర్ అక్టోబర్ 24న, 4వ పేపర్ అక్టోబర్ 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

Similar News

News November 25, 2024

నర్సంపేట: 29న పారా మెడికల్ కోర్సులకు ఇంటర్వ్యూలు

image

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న పారా మెడికల్ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. నర్సంపేట ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలో D.ECG, D.Dialysis కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

News November 25, 2024

MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి

image

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News November 25, 2024

నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్

image

నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.