News September 27, 2024

తిరుపతిలో టెన్షన్‌ టెన్షన్‌

image

వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతిలో టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తిరుపతి, తిరుమలలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనకు రావొద్దంటూ వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. పలువురిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు రేణిగుంట విమానాశ్రయంలోనే జగన్‌కు నోటీసులు ఇచ్చి శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం వెనక్కి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 14, 2026

టీచర్లకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈనెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. 189 మంది మాత్రమే నమోదు చేశారని.. మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

News January 14, 2026

CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.

News January 14, 2026

చిత్తూరు జిల్లాలో 62 బస్సులకు జరిమానా

image

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఐదు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో అధిక ఛార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్లు చెప్పారు. పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వసూళ్లు చేశామన్నారు.