News September 27, 2024

చరిత్ర సృష్టించేందుకు 35 పరుగులు కావాలి!

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అరుదైన జాబితాలో చేరనున్నారు. 534 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 26,965 పరుగులు చేశారు. మరో 35 చేస్తే అత్యంత వేగంగా 27వేల రన్స్ పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టులో ఆయన 35 రన్స్ చేస్తే ఇది సాధ్యమవుతుంది. కాగా, సచిన్, సంగక్కర, రికీ పాటింగ్‌ మాత్రమే 27వేల పరుగులు పూర్తిచేశారు. కోహ్లీ ఈ జాబితాలో చేరతారా?

Similar News

News December 21, 2024

అల్లు అర్జున్‌ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా?

image

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని కాకుండా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందని, ఆయనకు జైలు తప్పదేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

News December 21, 2024

NTRతో మూవీ తర్వాతే KGF-3, సలార్-2: హొంబలే

image

హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF విడుదలై నేటికి ఆరేళ్లు, సలార్‌‌కు రేపటితో ఏడాది పూర్తవుతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమాల్లో నటించిన యశ్, ప్రభాస్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం NTRతో తీసే సినిమాలో నీల్ బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాతే ఆయన KGF-3, సలార్-2 ప్రాజెక్టులు చేస్తారని వెల్లడించారు.

News December 21, 2024

టీ, కాఫీ తాగే వారికి అలర్ట్!

image

రోజుకో కప్పు కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మగవారు రోజుకు 3-5 కప్పుల కాఫీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అంతకుమించితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కెఫిన్ రోజుకు 400mg వరకు మాత్రమే తీసుకోవాలి. టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ ఉంటుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు 200mg కంటే ఎక్కువ తీసుకోకూడదు.