News September 27, 2024

UNSC మెంబర్‌షిప్: భారత్‌కు యూకే సపోర్ట్

image

UNSCలో భారత శాశ్వత సభ్యత్వానికి UK PM కీర్ స్టార్మర్ సపోర్ట్ ‌ ఇచ్చారు. ‘కౌన్సిల్లో ఆఫ్రికాకు శాశ్వత ప్రాతినిధ్యం ఉండాలి. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీని శాశ్వత సభ్యులుగా చూడాలనుకుంటున్నాం. ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సీట్లు ఉండాలి’ అని అన్నారు. కొన్నాళ్ల కిందటే జో బైడెన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత్‌కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం UNSCలో 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి.

Similar News

News September 27, 2024

కుప్పకూలిన బంగారు గని.. 15 మంది మృతి

image

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ సుమత్రలో కొండచరియలు విరిగిపడటంతో అక్రమ బంగారు గని కుప్పకూలి 15 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. రిమోట్ ఏరియా కావడంతో రవాణా సదుపాయం సరిగా లేదని వెల్లడించారు. దీంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.

News September 27, 2024

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు

image

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నిర్ధారణ అయ్యింది. ఎర్నాకుళం వాసికి ప‌రీక్ష‌ల్లో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన‌ట్టు కేరళ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ స్ట్రెయిన్ అన్న‌ది ఇంకా నిర్ధార‌ణకాలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. Sep 18న కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురంలో UAE నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి వైర‌స్ పాజిటివ్‌గా తేలడంతో దేశంలోనే మొద‌టి కేసు న‌మోదైంది.

News September 27, 2024

ఆ డేటింగ్ యాప్‌లో హీరోలూ ఉన్నారు: ఊర్వశీ రౌతేలా

image

తనతోపాటు చాలా మంది సెలబ్రిటీలు ‘రాయ’ డేటింగ్ యాప్‌లో ఉన్నారని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తెలిపారు. మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్‌లో చేరినట్లు ఆమె చెప్పారు. హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్ కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్లు యాప్‌లో చేరారని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ కోసమే ఈ యాప్‌లో చేరానని, దీనిని మరో కోణంలో చూడొద్దని ఆమె అన్నారు. కాగా టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో ఊర్వశి డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి.