News September 27, 2024

జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం: స్వామీజీలు

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.

Similar News

News November 14, 2025

ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్.. తర్వాత EVM ఓట్ల కౌంటింగ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉ.8 గం.కు పోస్టల్ బ్యాలెట్‌తో ప్రారంభం కానుంది. 8.30 గం. నుంచి EVM ఓట్ల కౌంటింగ్ షురూ చేస్తారు. షేక్‌పేట్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ డివిజన్ల వారీగా లెక్కింపు జరగనుంది. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,94,631 మంది ఓట్లేశారు. పోలింగ్ శాతం 48.49%గా నమోదైంది.

News November 14, 2025

చిల్డ్రన్స్ డే నవంబర్ 20న జరుపుకునేవారు తెలుసా?

image

పిల్లలపై మాజీ ప్రధాని నెహ్రూ చూపిన ప్రేమ, వారి విద్య కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తారు. గతంలో UNO ప్రకటించిన నవంబర్ 20న దీనిని సెలబ్రేట్ చేసుకునేవారు. 1964లో నెహ్రూ మరణానంతరం ఆయనకు నివాళిగా మన దేశంలో నవంబర్ 14కి మార్చారు. పిల్లల హక్కులు, విద్య, అభివృద్ధి, సమానత్వం, రక్షణపై అవగాహన పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం.

News November 14, 2025

ఆ ఎకరం.. పోషకాల వరి వంగడాలకు నిలయం

image

యాదగిరి శ్రీనివాస్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సేద్యం చేస్తున్నారు. తనకు 3 ఎకరాల భూమి ఉండగా 2 ఎకరాల్లో సాధారణ రకాలను, మరో ఎకరంలో 400 వరి రకాలను సాగు చేస్తున్నారు. మంచి పోషక విలువలతో కూడిన తులసి బాసో, ఇతర ఎర్ర, నల్ల వరి రకాలు కూడా శ్రీనివాస్ భూమిలో పండుతున్నాయి. అవసరం మేరకు విత్తనాలను భద్రపరిచి.. ఆసక్తి ఉన్న రైతులకు విత్తనాలను అందిస్తూ, మిగిలిన వాటిని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు.