News September 27, 2024

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు

image

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నిర్ధారణ అయ్యింది. ఎర్నాకుళం వాసికి ప‌రీక్ష‌ల్లో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన‌ట్టు కేరళ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ స్ట్రెయిన్ అన్న‌ది ఇంకా నిర్ధార‌ణకాలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. Sep 18న కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురంలో UAE నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి వైర‌స్ పాజిటివ్‌గా తేలడంతో దేశంలోనే మొద‌టి కేసు న‌మోదైంది.

Similar News

News September 27, 2024

సేల్‌లో flipkart & amazonలో ఫోన్స్ ఆర్డర్ చేశారా?

image

ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ flipkart & amazonలో భారీ డిస్కౌంట్స్ సేల్ నడుస్తోంది. టీవీ, మొబైల్స్ వంటివి యూజర్లు బుక్ చేస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో నిన్న ఓ వ్యక్తి గూగుల్ పిక్సల్ మొబైల్ ఆర్డర్ చేయగా ఈరోజు డెలివరీ అయింది. కానీ, బాక్స్‌కు సీల్ లేకపోవడం, మొబైల్‌పై స్క్రాచెస్ ఉండటం చూసి అతను OTP షేర్ చేయలేదు. దీంతో పార్సిల్ రిటర్న్ వెళ్లింది. మీరు కూడా ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయడం బెటర్.

News September 27, 2024

జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు: చంద్రబాబు

image

AP: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి అనేక మంది ఇతర మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘చట్టాన్ని గౌరవించాల్సిన మొదటి వ్యక్తి సీఎం. ఆ హోదాలోనే జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి ఆయనకు సిగ్గుండాలి. జగన్‌కు విశ్వసనీయత లేదు. దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. మత సామరస్యాన్ని పాటిద్దాం’ అని స్పష్టం చేశారు.

News September 27, 2024

డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్‌కు ఇబ్బంది ఏంటి?: సీఎం

image

AP: బైబిల్ చదువుతానని చెప్పిన YS జగన్‌కు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎన్నో ఏళ్లుగా డిక్లరేషన్ అనేది ఉంది. CMగా ఉన్నప్పుడు ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. అప్పుడు చేసినట్లుగా ఇప్పుడూ చేస్తానంటే ఎలా? చట్టాలు, సంప్రదాయాలను గౌరవించడంలో సీఎం మొదటి వ్యక్తిగా ఉండాలి’ అని సీఎం సూచించారు.