News September 27, 2024
ఇది నిశ్శబ్ద విప్లవం: మన్సుఖ్ మాండవీయ

PM మోదీ తీసుకొచ్చిన విధానాలతో గత ఏడేళ్లలో మహిళా కార్మికులు రెట్టింపయ్యారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రస్తుతం కొన్ని సెక్టార్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సమయం పనిచేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దీని గురించి మరింతగా మాట్లాడుకుంటామన్నారు. ఈ మార్పును నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించారు. మహిళలు ముందుండి బాధ్యతలు తీసుకుంటూ అడ్డంకులను బద్దలు కొడుతున్నారని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
Similar News
News January 14, 2026
ఆర్థిక సంఘం నిధులు వచ్చేస్తున్నాయ్!

TG: సుమారు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి నిలిచిపోయిన గ్రామపంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పడగా జీపీలకు త్వరలో 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. రాష్ట్రానికి రూ.2,500Cr పెండింగ్ ఉండగా ఈ నెలాఖరు నాటికి రూ.1000Cr, వచ్చేనెల రూ.1500Cr కేంద్రం రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ప్రతి జీపీకి ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్‌తో నిధులను వినియోగిస్తారు.
News January 14, 2026
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News January 14, 2026
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,014 మంది దర్శించుకోగా.. 19,639 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.


