News September 27, 2024
సెన్సెక్స్, నిఫ్టీలో అక్కడ బలమైన రెసిస్టెన్స్
All Time Highలో ఉన్న సెన్సెక్స్‌లో 86,000 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్ BSE సూచీని నష్టాలబాట పట్టించింది. ఏ సెషన్‌లోనూ సూచీ ఈ కీలక దశను దాటలేకపోయింది. Lower Low ఫాం చేసుకుంటూ నష్టాలవైపు సాగింది. అటు నిఫ్టీలో 26,300 వద్ద Call సైడ్ భారీ OI, Change In OI ఉండడంతో బేర్స్ (Call Sellers) తమ బలాన్ని ప్రదర్శించారు. చివరికి సూచీ 26,170 స్థాయిలో సపోర్ట్ తీసుకుంటూ కన్సాలిడేట్ అయ్యింది.
Similar News
News December 21, 2024
జనవరి 2న క్యాబినెట్ భేటీ
AP: జనవరి 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు విషయాలపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, అమరావతి పనులపై చర్చిస్తుందని సమాచారం.
News December 21, 2024
RGV ‘వ్యూహం’ మూవీకి నోటీసులు
డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీకి AP ఫైబర్ గ్రిడ్ లీగల్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్‌లో వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు లబ్ధి పొందడంతో RGVతోపాటు మరో ఐదుగురికి కూడా సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా తీసుకున్న డబ్బును వెనక్కి కట్టాలని ఆదేశించింది. కాగా ఫైబర్ నెట్‌లో వ్యూహం సినిమాకు 1,816 వ్యూస్ రాగా అప్పటి ప్రభుత్వం రూ.1.15 కోట్లు చెల్లించిందని ఫైబర్ గ్రిడ్ ఆరోపించింది.
News December 21, 2024
ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి: పవన్ కళ్యాణ్
AP: తాను కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్లిపోనని, 5ఏళ్లు పని చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి (D) బల్లగరువులో పర్యటించిన ఆయన 100 కి.మీ. మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇంతకు ముందు 250 మంది ఉంటే కానీ రోడ్లు పడేవి కాదని, కానీ 100 మంది ఉన్నా రోడ్డు వేయాలని PM మోదీ చెప్పడంతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు.