News September 27, 2024

చంద్రబాబూ.. మీ హయాంలో రూ.276కే నెయ్యి ఎలా కొన్నారు?: జగన్

image

AP: నందిని నెయ్యిని YCP హయాంలో కొనుగోలు చేయలేదని, మిగతా కంపెనీల నెయ్యిని తక్కువ ధరకు కొన్నారని చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘CBN హయాంలో 2015-2018 మధ్య నందిని బ్రాండ్‌ను ఎందుకు కొనుగోలు చేయలేదు? 2015లో కేజీ నెయ్యి ధర రూ.276, 2019లో రూ.324కు కొన్నారు. మా హయాంలో రూ.320కి కొంటే తప్పేముంది? ఇప్పుడు హెరిటేజ్ ధరలు పెంచుకోవడానికి CBN ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

‘తొలిప్రేమ’ ఓ ట్రైనింగ్ సెషన్: అధ్యయనం

image

ఫస్ట్ లవ్ కొందరికి మధుర కావ్యం. మరికొందరికి తీరని వ్యథ. ఏదేమైనా దీనికి ముగింపు ఉండదని, ఇది జీవిత పాఠాలను నేర్పించడానికేనని ఓ అధ్యయనంలో తేలింది. మొదటి ప్రేమ గమ్యం కాదని, ఇది కేవలం భావోద్వేగాలు, అంచనాలు & హార్ట్ బ్రేకింగ్ అనుభవాన్ని పరిచయం చేసేదని నిపుణులు పేర్కొన్నారు. దీనిని ‘ట్రైనింగ్ సెషన్’గా వారు అభివర్ణించారు. ఈ అనుభవంతోనే భవిష్యత్తులో వచ్చే సంబంధాలకు సిద్ధమవుతారని అధ్యయనం చెబుతోంది.

News November 6, 2025

ధాన్యం అమ్మిన రోజే అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ధాన్యం అమ్మిన రైతులకు అదేరోజు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజూ నాలుగుసార్లు.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో పేమెంట్‌ గేట్‌వే పనిచేయదు కనుక, ఆ డబ్బులు మరుసటి రోజు జమ అవుతాయన్నారు.

News November 6, 2025

ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక పెళ్లి?

image

విజయ్ దేవరకొండ-రష్మికల వివాహం వచ్చే ఏడాది FEB 26న(26-2-26) జరగనున్నట్లు సమాచారం. రాజస్థాన్ ఉదయ్‌పూర్ కోట వేదికగా వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా OCT 3న వీరి <<17907469>>ఎంగేజ్‌మెంట్<<>> పూర్తయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇరు కుటుంబాలు స్పందించకపోయినా ఇద్దరూ చేతి వేళ్లకు రింగ్స్‌తో కనిపిస్తున్నారు. ‘గర్ల్‌ఫ్రెండ్’ ఈవెంట్, ఓ టాక్ షోలోనూ ‘నేషనల్ క్రష్’ పరోక్షంగా <<18124449>>నిశ్చితార్థంపై<<>> హింట్ ఇచ్చారు.