News September 27, 2024

షారుఖ్ గురించి ఈ విషయం తెలుసా?

image

సినిమాల కలెక్షన్లలో రికార్డులు సృష్టించే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు వ్యక్తిగత జీవితంలో ఓ రికార్డుంది. ఆయనకు ఏకంగా 5 గౌరవ డాక్టరేట్లు దక్కాయి. 2009లో బెడ్‌ఫోర్డ్‌షైర్ యూనివర్సిటీ(యూకే), 2015లో యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో(యూకే), 2016లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(Hyd), 2019లో యూనివర్సిటీ ఆఫ్ లా(లండన్), ఈ ఏడాది లా ట్రోబ్ యూనివర్సిటీ(ఆస్ట్రేలియా) SRKకి డాక్టరేట్లు ప్రదానం చేశాయి.

Similar News

News September 27, 2024

ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు APలోని అల్లూరి, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అటు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 27, 2024

DEVARA: రెమ్యునరేషన్ ఎవరికెంతంటే?

image

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది చర్చగా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు రూ.60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ రూ.30 కోట్లు, సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

News September 27, 2024

పసిఫిక్‌లో చైనా నౌక.. జపాన్ ఆందోళన

image

చైనాకు చెందిన యుద్ధవిమాన వాహక నౌక ‘లావోనింగ్’ గత ఏడు రోజులుగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తోందని జపాన్ రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నౌకకు అండగా మరిన్ని చైనా నౌకలు వెంట వెళ్తున్నాయని పేర్కొంది. తమకు చెందిన ఒకినొటోరీ దీవికి సుమారు 1,020 కిలోమీటర్ల దూరంలో ఆ నౌకలతో చైనా విన్యాసాలు చేయిస్తోందని ఆరోపించింది. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ సహా పలు ఆసియా దేశాలతో చైనాకు వివాదాలున్న సంగతి తెలిసిందే.