News September 27, 2024

ఇరుకైన 2BHKకు రూ.1.35 లక్షల రెంట్!

image

ఎంత సంపాదించినా అందులో సగం ఇంటి రెంట్‌కే పోతోందని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అంతలా పెరిగిపోయాయ్ మరి అద్దె ధరలు. ఈ నేపథ్యంలో ముంబైలోని పాలి హిల్‌లో 2BHK ఫ్లాట్‌లో ఉండాలంటే రూ.1.35 లక్షలు చెల్లించాలనే ఓ ప్రకటన వైరలవుతోంది. బాత్రూమ్‌లో టాయిలెట్ సింకు పైనే వాషింగ్ మెషీన్ అమర్చడం, రూ.4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాలని చెప్పారు. ఆ డబ్బులతో కొత్త ఫ్లాట్ కొనుక్కోవచ్చంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Similar News

News January 25, 2026

కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

image

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ITI, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.31,020 చెల్లిస్తారు. సైట్: https://recruit.cusat.ac.in

News January 25, 2026

వంటింటి చిట్కాలు

image

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, కొద్దిగా గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* క్యాలీఫ్లవర్ ఉడికించేప్పుడు కాసిని పాలు పోస్తే కూర రంగు మారదు.

News January 25, 2026

తెలుగు రాష్ట్రాల్లో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు ఘటనల్లో ఐదుగురు మరణించారు. నాగర్ కర్నూల్(D) ముచ్చర్లపల్లిలో నీటి గుంతలో పడి సిరి(14), శ్రీమన్యు(14), స్నేహ(15) అనే ముగ్గురు విద్యార్థులు మరణించారు. గుంతలో పడిన ఒకరిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారు. APలోని నెల్లూరు(D) తూర్పు రొంపిదొడ్లలో ఇద్దరు యువకులు గణేశ్ (16), రమేశ్ (15) బైక్‌పై వెళ్తుండగా కందిచేను చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సజీవదహనమయ్యారు.