News September 27, 2024

పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ సంయుక్తంగా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 56 మంది హాజరు కాగా, 22 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్ కోటేశ్వరయ్య తెలిపారు. కార్యక్రమంలో APSSDC అధికారి వీరయ్య, SEEDAP జిల్లా ప్లేస్మెంట్ అధికారి చైతన్య, లోకేశ్, నరసింహులు SPOC, స్కిల్ హబ్ కోఆర్డినేటర్స్ రసూల్, సిసింద్రి, అబ్దుల్, అజేశ్ పాల్గొన్నారు.

Similar News

News March 6, 2026

చిత్తూరు జిల్లాలో 10 పరీక్షలు రాస్తున్నారా..?

image

చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె మోడల్ స్కూల్‌ను రాంనగర్ కాలనీకి మార్చారు. 10వ తరగతి హాల్ టికెట్లలో కొంగారెడ్డిపల్లె అడ్రస్ ముద్రించారు. ముందుగా సెంటర్ చూసుకోవడానికి వెళ్లిన విద్యార్థులు అక్కడ తాళం వేసి ఉండటంతో ఖంగుతిన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్ కార్యాలయంతో మాట్లాడి హాల్‌టికెట్లు మార్చి ఇస్తామని DEO రాజేంద్ర ప్రసాద్ Way2Newsకు తెలిపారు. మీరు కూడా ముందే ఎగ్జాం సెంటర్‌ను చెక్ చేసుకోవడం మంచిది.

News March 5, 2026

చిత్తూరు: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

image

చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జింక చలపతి (పుంగనూరు), బాబాజాన్ (పూతలపట్టు), మొగసాల కృష్ణమూర్తి (కుప్పం), వెంకటరెడ్డి యాదవ్ (పలమనేరు), మొగసాల రెడ్డప్ప (చిత్తూరు), రాహుల్ రాజారెడ్డి (నగరి), వల్లివేడు పృథ్వీ రెడ్డి (జీడి నెల్లూరు)కు పరిశీలకులుగా నియమించారు.

News March 5, 2026

చిత్తూరులో జాతీయ జెండా ఎగిరి.. 30 రోజులకు పైనే

image

చిత్తూరు జిల్లా కేంద్రంలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరి ముచ్చటగా 30 రోజులకు పైనే అయింది. నగరంలోని గాంధీ కూడలి వద్ద “ఐ లవ్ చిత్తూరు” పార్కులో భారీ ఎత్తులో జాతీయ జెండా స్తంభం ఏర్పాటుచేసి అందులో జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు జెండాను ఘనంగా ఆవిష్కరించిన అనంతరం దాదాపు జాతీయ జెండా ఎగరలేదు. స్తంభం మాత్రమే దర్శనమిస్తోంది. మన జాతీయ జెండా ఎగరడానికి దృష్టి పెట్టండి సారూ.!