News September 27, 2024

డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: సీఎం చంద్రబాబు

image

AP: భక్తులు పవిత్రంగా భావించే తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇతర మతస్థులు అక్కడికెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ‘దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. జగన్‌కు తిరుమలకు వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదు. ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పాం. తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది’ అని తెలిపారు.

Similar News

News August 30, 2025

5.5 లక్షల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతి పెద్దది!

image

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ‘ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్’ పేరిట దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో దీనిని చేపట్టనుంది. ఇది సింగపూర్ దేశ విస్తీర్ణం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇది 100 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయనుంది. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ కోసం స్థానికులకు వేలాది ఉద్యోగాలు రానున్నాయి.

News August 30, 2025

సురవరం పేరు నిలిచిపోయేలా నిర్ణయం: రేవంత్

image

TG: ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు విపక్షాలు కలిసి రావాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. HYD రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో CM పాల్గొన్నారు. ‘నమ్మిన సిద్ధాంతాన్ని సురవరం చివరి వరకు వీడలేదు. ఆయనకు మంచి గుర్తింపునిచ్చేలా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం. దేశంలో అధికారంలో ఉన్నవాళ్లు.. ECని భాగస్వామిని చేసుకుని వారికి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు.

News August 30, 2025

ఉక్రెయిన్‌కు టాప్ డీజిల్ సప్లయర్‌గా భారత్

image

ఉక్రెయిన్‌కు భారత్ టాప్ డీజిల్ సప్లయర్‌గా నిలిచినట్లు ఆయిల్ మార్కెట్ నిపుణులు తెలిపారు. 2025 జులైలో రోజుకు 2,700 టన్నుల డీజిల్ దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. 2024 జులైలో 1.9% ఉన్న దిగుమతులు ఒక్క ఏడాదిలోనే 15.5%కి ఎగబాకాయన్నారు. రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు కావాల్సిన ఎకానమీ సపోర్ట్‌కు ఈ డీజిల్ దిగుమతులు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.