News September 27, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్డీవోల బదిలీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. అనకాపల్లి ఆర్డీవోగా షేక్ ఆయేషాను నియమించారు. విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహిబ్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో పోలూరి శ్రీలేఖను నియమించారు. భీమిలి ఆర్డీవో భాస్కర్ రెడ్డి స్థానంలో కె.సంగీత్ మాధుర్ బదిలీపై వచ్చారు. VMRDA సెక్రటరీని బదిలీ చేయగా ఆమెను విజయనగరం ఆర్డీవోగా నియమించారు.

Similar News

News September 21, 2025

విశాఖలో శొంఠ్యాం కోడి రూ.300

image

మాధవధార, మురళి నగర్, మర్రిపాలెంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ లైవ్ రూ.160, స్కిన్ లెస్ రూ.280, విత్ స్కిన్ రూ.260, శొంఠ్యాం కోడి రూ.300కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. ఆదివారం కావడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.

News September 21, 2025

సమయపాలన పాటించని జీవీఎంసీ సిబ్బంది?

image

జీవీఎంసీ ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికే విధులకు హాజరుకావాలని అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ఆదేశించారు. శనివారం విశాఖలో అన్ని జోన్ల సిబ్బందితో సమావేశమై ఉదయం9:30 నుంచి సా.5:30 వరకు వీధులు నిర్వహించాలని సూచించారు. చాలాచోట్ల మధ్యాహ్నం విధులకు హాజరు కావడంలేదని ఫిర్యాదులొస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ పూర్తి చేసి పంపించాలని, పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

News September 21, 2025

గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ.. రైతుల విజ్ఞప్తులు ఇవే..!

image

తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం జరుగుతున్న భూసేకరణలో నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారుల భూములకు రిజిస్టర్ మార్కెట్ ధరలో సగం మేర మాత్రమే ప్రకటించిన పరిహారం మొత్తాన్ని పెంచాలని కోరారు. 20ఏళ్ల క్రితం డీఆర్‌డీఈ ద్వారా మొక్కల పెంపకానికి ఇచ్చిన భూములకు కూడా నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. సోమవారం విశాఖ వస్తున్న CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని గంటా హామీ ఇచ్చారు.