News September 27, 2024

హైడ్రా పేరుతో దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదు: ఈటల

image

TG: హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్పారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షలు పెట్టి ఇళ్లు కొన్నవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామనడం సరికాదన్నారు. ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన విషయం మరువొద్దన్నారు. కూల్చివేతలపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు.

Similar News

News January 2, 2026

గ్రోక్ ‘బికినీ’ ట్రెండ్.. మహిళా ఎంపీ ఆందోళన

image

ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ అసభ్యకర ట్రెండింగ్‌పై శివసేన(UBT) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ ఐటీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. మహిళల ఫొటోలను గ్రోక్ ద్వారా అశ్లీలంగా మార్ఫ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. కాగా ‘X’ సీఈవో మస్క్ కూడా ‘బికినీ’ ట్రెండ్‌ను వైరల్ చేస్తుండటం గమనార్హం.

News January 2, 2026

INC, BRS హోరాహోరీ ‘ప్రిపేర్’ అయ్యాయి కానీ…

image

CM హోదాలో గతంలో KCR కృష్ణా జలాలపై చర్చ పెడితే ‘ప్రిపేర్’ కాలేదని అప్పటి విపక్ష నేత ఉత్తమ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై కేసీఆర్ సెటైర్లూ వేశారు. మళ్లీ ఇదే అంశం ఇప్పుడు చిచ్చు రేపగా INC, BRS హోరాహోరీ ప్రిపేరయ్యాయి. మంత్రి ఉత్తమ్ వారం నుంచీ ఇదే పనిలో ఉన్నారని CM చెప్పారు. తీరా అసెంబ్లీ ఆరంభం కాగా KCR రాలేదు. శాసనసభలో చర్చా లేదు. చివరకు ఇరుపార్టీల ప్రిపరేషన్ మొత్తం వృథా అయింది.

News January 2, 2026

రన్ తీస్తూ కిందపడ్డ సుదర్శన్.. విరిగిన పక్కటెముక

image

టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్ర గాయంతో బాధపడుతున్నారు. VHTలో తమిళనాడు తరఫున బరిలో దిగిన అతడు MPతో మ్యాచులో రన్ తీస్తూ కిందపడ్డారు. దీంతో పక్కటెముక విరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రికవరీ అవుతున్నారు. గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6 వారాలు పట్టనుంది. IPL నాటికి ఫిట్‌నెస్ సాధిస్తాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి.