News September 28, 2024

ఈనెల 29న కొండగట్టులో అర్చకులకు సన్మానం

image

కొండగట్టులో ఈనెల 29న అర్చకులకు సన్మానం నిర్వహించనున్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొండగట్టులోని బృందావనంలో సాంస్రృతిక కార్యక్రమాలు, చర్చాగోష్ఠితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలు ఆలయాల అర్చకులకు సన్మానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఎ.ఉజ్వల, కొండలరావు తెలిపారు. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News January 8, 2026

KNR: బ్యాంకుల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పటిష్టం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం హై-క్వాలిటీ సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు, బర్గ్లర్ అలారమ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగదు తరలింపుపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

News January 8, 2026

KNR: ‘విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలి’

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ సమీపంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించిన ఆమె.. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సంగీతం, కుట్టు శిక్షణ, కంప్యూటర్ కోర్సుల ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలని సూచించారు.

News January 8, 2026

KNR: ‘నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్’

image

ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. తిమ్మాపూర్‌లో జరిగిన ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వాహనదారులు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అలవరచుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.