News September 28, 2024
అప్పటిదాకా దాడులు ఆపేది లేదు: నెతన్యాహు

ఇజ్రాయెల్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ ప్రమాదకర శత్రువులను ఎదుర్కొంటుందని అధ్యక్షుడు నెతన్యాహు అన్నారు. UN జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ హమాస్ ఆయుధాలు విడిచే వరకు తమను తాము కాపాడుకొనేందుకు దాడులు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ‘నా దేశం యుద్ధంలో ఉంది. ఈ ఏడాది ఇక్కడికి రాకూడదనుకున్నా. అయితే ఇజ్రాయెల్‌పై తప్పుడు ఆరోపణలు విని వాటిని సరిదిద్దడానికి రావాలని నిర్ణయించుకున్నా’ అని నెతన్యాహు అన్నారు.
Similar News
News February 28, 2025
CT: మరో సంచలనమా?.. దాసోహమా?

మొన్న ENGను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ AUSతో పోరుకు సిద్ధమవుతోంది. మ.2.30 గంటలకు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. ENGను ఓడించి ఊపులో ఉన్న AFG.. AUSను కూడా కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ICC టోర్నీలంటే రెచ్చిపోయే AUS.. AFGపై విరుచుకుపడే అవకాశం ఉంది. మరి మరో సంచలనం నమోదవుతుందో? AUSకు AFG దాసోహం అవుతుందో?
News February 28, 2025
‘కన్నప్ప’ ఆఫర్‌ను రెండుసార్లు రిజెక్ట్ చేశా: అక్షయ్ కుమార్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’లో శివుడి క్యారెక్టర్ చేసేందుకు ముందు 2 సార్లు ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు. కానీ ఆ పాత్రకు తానే సరిగ్గా సరిపోతానంటూ విష్ణు చెప్పిన విధానం నచ్చడంతో అంగీకరించినట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ రూపమే దర్శనమిస్తుందని విష్ణు అన్నారు. కన్నప్ప APR 25న రిలీజ్ కానుంది.
News February 28, 2025
అంతరిక్షంలోకి హాలీవుడ్ సింగర్

హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ఈ ఏడాది న్యూ షెపర్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. అందులో ఆరుగురు సభ్యులు గల మహిళా బృందం వెళ్లనుంది. పెర్రీతో పాటు బెజోస్ ఫియాన్సీ సాంచెజ్, నటి గెయిల్ కింగ్, సామాజిక కార్యకర్త అమండా, నిర్మాత కరియన్నె ఫ్లిన్, నాసా మాజీ రాకెట్ సైంటిస్ట్ ఐషా బొవే వెళ్లనున్నారు.