News September 28, 2024
ఫ్రెండ్ బర్త్‌డే ఈవెంట్‌లో తళుక్కుమన్న మహేశ్!

మహేశ్ బాబు జక్కన్న డైరెక్షన్లో చిక్కుకున్నప్పటి నుంచీ ఆయన అభిమానులు అప్‌డేట్ కోసం విలవిల్లాడుతున్నారు. అప్‌డేట్ సంగతి అలా ఉంచి, తమ హీరోను మళ్లీ ఎప్పుడు చూస్తామో అంటూ వాపోతున్నారు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్‌కు మహేశ్ వెళ్లగా ఆ ఫొటోల్ని SSMB ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ మహేశ్ ఈ లుక్‌లో ఎలా ఉన్నారు?
Similar News
News October 29, 2025
రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్‌ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.
News October 29, 2025
మొదటి సంతానం అమ్మాయైతే వివక్ష తక్కువ

ప్రస్తుత సమాజంలో కొందరు ఆడపిల్లలపై ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. అయితే ఇళ్లల్లోనూ బిడ్డల మధ్య వివక్ష చూపడం సాధారణం అని భావిస్తారు. అయితే మొదటి సంతానం అమ్మాయి అయితే ఆ తండ్రుల్లో లింగ వివక్ష ధోరణి తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మాయి పెరిగే క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లే తండ్రి ఆలోచనా తీరులో ఈ మార్పుని తీసుకొస్తున్నాయని, దీన్నే మైటీ గర్ల్ ఎఫెక్ట్ అంటారని నిపుణులు చెబుతున్నారు.
News October 29, 2025
దైవారాధనలో ఆహార నియమాలు పాటించాలా?

దేహపోషణకే కాక, మోక్షప్రాప్తికి కూడా ఆహార నియమాలు ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆహార నియమాలు పాటించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండి, మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. దేవుడిపై మనస్సు లగ్నం కావాలంటే, కష్టపడి, నిజాయతీగా సంపాదించిన ఆహారాన్నే స్వీకరించాలి. దుఃఖం, కోపం, భయం కలిగించే ఆహారాలు భక్తికి ఆటంకం. కాబట్టి ఆత్మశుద్ధిని కాపాడే ఆహారం మాత్రమే భగవత్ చింతనకు, దైవ ప్రాప్తికి సహాయపడుతుంది. <<-se>>#Aaharam<<>>


