News September 28, 2024
మూసీ ప్రాంతంలో హైడ్రా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు: రంగనాథ్
AP: హైడ్రా గురించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారని అన్నారు. ‘మూసీ పరివాహక ప్రాంతంలో రేపు భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీకి సంబంధించి ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. అక్కడ మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కూకట్‌పల్లిలో మహిళ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు’ అని తెలిపారు.
Similar News
News December 21, 2024
విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు
బెంగళూరులోని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకే BBMP (బెంగళూరు బృహత్ మహానగర పాలికే) సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్‌లోని ఆరో ఫ్లోర్‌లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్.ఎమ్ వెంకటేశ్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపింది.
News December 21, 2024
సినీ స్టార్లపై సీఎం రేవంత్ ఫైర్
TG: అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని CM రేవంత్ మండిపడ్డారు. బన్నీ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘సంధ్య థియేటర్‌కు హీరో, హీరోయిన్ రావొద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అని ఫైర్ అయ్యారు.
News December 21, 2024
నేను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదు: CM రేవంత్
TG: తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదని, జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా? వద్దా?. కొడంగల్‌లో 1300 ఎకరాల భూసేకరణ చేసి, అక్కడి యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డుకుంటున్నారు. నేను పులులు తిరిగే ప్రాంతం నుంచి వచ్చాను’ అని రేవంత్ అన్నారు. అటు, GHMC సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.