News September 28, 2024
డిగ్రీ పూర్తైన వారికి ALERT

AP: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ MLA ఎన్నికలకు SEP 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం-18లో పాస్‌పోర్ట్ ఫొటో, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్, ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాలి. 2021 జూన్‌లోపు డిగ్రీ పూర్తైనవారు దరఖాస్తుకు అర్హులు. 10+2+3 విధానంలో పాసైన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవాలి. టెన్త్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వారు అనర్హులు.
Similar News
News September 16, 2025
పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

IND vs PAK మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామన్న పాక్‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News September 16, 2025
డబ్బు ఇస్తామన్నా తెచ్చుకోలేమా..? అధికారులపై ఫైరైన CM!

తెలంగాణ CM రేవంత్ కొందరు ఉన్నతాధికారులపై మండిపడ్డట్లు తెలుస్తోంది. గతవారం ఢిల్లీ టూర్లో కేంద్రమంత్రి గడ్కరీకి CM, TG అధికారులు ₹1600 కోట్ల పనుల DPR ఇచ్చారు. అప్పుడు వారితో ₹1600 కోట్లు కాదు.. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల DPR తెస్తే ₹20వేల కోట్లు ఇస్తామని గడ్కరీ అన్నారట. దీంతో డబ్బు ఇస్తామన్నా ఎందుకు డ్రాఫ్ట్ రెడీ చేయలేదని, సీనియర్ అధికారులై ఉండి ఏం లాభమని వారిపై రేవంత్ ఫైర్ అయ్యారని సమాచారం.
News September 16, 2025
దళితవాడల్లో 1,000 ఆలయాలు: TTD

AP: మత మార్పిడుల నివారణకు దళితవాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 6 ఆలయాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ‘ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఆ రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. 24న సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు’ అని వివరించారు.