News September 28, 2024

ఇథ‌నాల్, చక్కెర కనీస అమ్మకపు ధ‌ర‌ల పెంపుపై కేంద్రం యోచ‌న‌

image

ఇథనాల్, చక్కెర కనీస అమ్మకపు ధర (2019 ఫిబ్రవరి నుంచి కిలోకు రూ.31) పెంపు స‌హా 2024-25లో చక్కెర ఎగుమతి విధానాన్ని సమీక్షించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇథనాల్ ధరను పెంచే విషయం పరిశీలనలో ఉంద‌ని, ఈ విష‌య‌మై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. ఇక ఎగుమ‌తుల‌పై వ‌చ్చే ఏడాది ఉత్ప‌త్తి, ల‌భ్య‌త ఆధారంగా నిర్ణ‌యిస్తామ‌ని వెల్ల‌డించారు.

Similar News

News September 28, 2024

నేడు రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా

image

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రానికి రానున్నారు. తొలుత ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ MLAలు, MLCలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై సూచనలు చేయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఢిల్లీ బయలుదేరుతారు.

News September 28, 2024

ALERT: ఉరుములు, మెరుపులతో వర్షాలు

image

TG: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News September 28, 2024

అక్టోబర్ 15 నుంచి ఇంటర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్

image

AP: ఇంటర్ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉ.9గంటల నుంచి 10.30 గంటల వరకు, సెకండియర్ వారికి ఉ.11 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.