News September 28, 2024
సీఎం పర్యటనల కోసం అడ్వాన్స్ టీమ్స్ ఏర్పాటు

ఏపీ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పర్యటనల ముందస్తు ఏర్పాట్ల కోసం రెండు అడ్వాన్స్ టీమ్స్‌ను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు చేయాల్సిన పనులపై ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. సీఎం పర్యటనలకు 24 గంటల ముందు ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేస్తాయి.
Similar News
News January 13, 2026
ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులకు నిధులు

TG: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారులకు బకాయిలను విడుదల చేశారు. కలెక్టర్ల నివేదికల మేరకు అర్హులైన లబ్ధిదారుల పెండింగ్ బిల్లులకు రూ.12.17 కోట్లు రిలీజ్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD వి.పి.గౌతం తెలిపారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇండ్లు నిర్మించుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్‌మెంట్ వరకే పనులు చేసిన వారి పెండింగ్ బిల్లులనూ ఈ నిధులతో క్లియర్ చేయనున్నారు.
News January 13, 2026
‘చైనా పార్టీ’తో BJP సమావేశంపై కాంగ్రెస్ ఫైర్

సరిహద్దుల్లో చైనా షాక్స్‌గామ్ వ్యాలీని ఆక్రమించుకుంటూ ఉంటే.. BJP నేతలు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో ఢిల్లీలో రహస్య చర్చలు జరపడం ఏంటని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గల్వాన్‌లో సైనికులు ప్రాణత్యాగం చేసినా, అరుణాచల్‌లో చైనా గ్రామాలు కడుతున్నా BJPకి పట్టదా? అని సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. అసలు ఈ బంధం వెనక ఉన్న ఒప్పందం ఏంటని ధ్వజమెత్తారు. BJP నేతలతో CCP ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.
News January 13, 2026
క్రెడిట్ కార్డ్ ఎడాపెడా వాడేస్తున్నారా? IT నోటీసు రెడీ..

మీ సంపాదనకు.. క్రెడిట్ కార్డ్ ఖర్చులకు పొంతన లేకపోతే ఆదాయ పన్ను శాఖ మీపై గురి పెడుతుంది. ఫ్రెండ్స్ కోసం స్వైప్ చేయడం, రెంట్ పేమెంట్స్ పేరుతో మనీ సర్క్యులేట్ చేయడం, రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు బుక్కైనట్టే. వాలెట్ లోడింగ్, భారీ క్యాష్ బ్యాక్ లావాదేవీలను IT నిశితంగా గమనిస్తోంది. అనుమానం వస్తే నోటీసులు పంపుతుంది. ఆధారాలు చూపలేకపోతే ఆ ఖర్చును అక్రమ ఆదాయంగా పరిగణిస్తుంది.


