News September 28, 2024
ప్రకాశం: 2018లో బాలుడి హత్య.. చేధించిన పోలీసులు

ప్రకాశం జిల్లా అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన బాలుడి హత్య కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించి, ప్రస్తుతం పామూరు సీఐ భీమా నాయక్, అప్పటి అర్థవీడు ఎస్సై రవీంద్రనాథ్ రెడ్డి, కోర్టు లైజన్ కానిస్టేబుల్ వరదయ్యలను ఎస్పీ ఏర్ దామోదర్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోలీసు అధికారులకు ఎస్పీ ఆఫీసులో ప్రశంశా పత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపు లభిస్తుందన్నారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.
News January 13, 2026
ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 13, 2026
సింగరాయకొండలో చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలు

చైనా మాంజా తగిలి ఉద్యోగికి గాయాలైన ఘటన మంగళవారం సింగరాయకొండలో చోటుచేసుకుంది. బాధితుడు, పోస్ట్‌మ్యాన్ గోపి వివరాల మేరకు.. ఉదయాన్నే ఉత్తరాల బట్వాడా చేసే సమయంలో గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం మెడకు తగిలి గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మాంజ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.


