News September 28, 2024
85 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి.. 11 ఏళ్ల జైలు శిక్ష

85 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజమండ్రి 8వ న్యాయస్థానం, క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. కరప మండలం వేలంగికి చెందిన వెంకటరమణ గతేడాది ఫిబ్రవరి 7న రాయవరానికి చెందిన వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా శిక్ష విధించారన్నారు.
Similar News
News January 30, 2026
తూ.గో: రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు

కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ రెండోరోజు కొనసాగుతోంది. గురువారం రాత్రి డీఎస్పీ కిషోర్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కతేలని రూ.1,82,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ లక్ష్మిపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణల నేపథ్యంలో, గత రెండు రోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
News January 30, 2026
రాజమండ్రి కార్గో విమాన సదుపాయాలపై పార్లమెంట్‌లో పురంధేశ్వరి ప్రశ్న

రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఆక్వా ఉత్పత్తులు, నర్సరీ మొక్కలు, ఇతర నిత్యావసరాల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్గో టెర్మినల్ ఏర్పాటుపై ఎంపీ పురంధేశ్వరి శుక్రవారం పార్లమెంట్‌లో గళమెత్తారు. దీనిపై పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ స్పందిస్తూ.. కార్గో సదుపాయాల కల్పన మార్కెట్ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుందని వెల్లడించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
News January 30, 2026
తూ.గో: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్

ఫిబ్రవరి 1న ఆదివారం సెలవు కావడంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒక రోజు ముందుగానే జనవరి 31న పంపిణీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని 2.71 లక్షల మంది లబ్ధిదారులకు రూ.118.64 కోట్లను నేరుగా ఇంటి వద్దే అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పంపిణీ ప్రక్రియ కోసం 4,600 మంది అధికారులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.


