News September 28, 2024

భారీగా పెరిగిన ధరలు

image

దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంపై సామాన్యుడు భగ్గుమంటున్నాడు. ఇప్పటికే నూనె ధరలు లీటరుపై రూ.20-45 వరకూ పెరిగాయి. అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360, ఎండు మిర్చి రూ.200 నుంచి రూ.240, కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.175, పెసరపప్పు రూ.30 పెరిగి రూ.150, మినపపప్పు రూ.135కి చేరింది. ఇక ఉల్లి ధరలు రూ.60 నుంచి కిందకు దిగడం లేదు. కూరగాయల ధరలూ అంతే ఉన్నాయి.

Similar News

News September 28, 2024

PHOTOS: కలల గూడు.. కన్నీటి గోడు

image

TG: ‘హైడ్రా’ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించడంతో చాలామంది ఇవాళ తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. వారితో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారంటూ బాధితులు గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు పైన చూడొచ్చు.

News September 28, 2024

APPLY NOW.. 8,113 ఉద్యోగాలు

image

రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు OCT 13 వరకు అప్లై చేయవచ్చు. OCT 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు ఛాన్సుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 28, 2024

బ్యాంక్ అకౌంట్లను ఊడ్చేస్తున్న హెల్త్‌కేర్ కాస్ట్

image

దేశంలో హెల్త్‌కేర్ కాస్ట్ ఏటా 14% పెరుగుతోందని ACKO హెల్త్ ఇన్సూరెన్స్ ఇండెక్స్ రిపోర్టు తెలిపింది. ఈ సెక్టార్లో డబుల్ డిజిట్ ఇన్‌ఫ్లేషన్ ఉండటమే కారణమంది. హాస్పిటల్ ఛార్జీల్లో 23% అప్పు చేసి, 63% సేవింగ్స్ డబ్బుతో చెల్లిస్తున్నారని వెల్లడించింది. దీంతో ఫ్యామిలీపై విపరీతమైన భారం పడుతోందని తెలిపింది. ఇలాంటి ఊహించని సంక్షోభాల్లో చిక్కుకోకుండా మెరుగైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరమని సూచించింది.