News September 28, 2024
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన భార్య అయేషా ఫిర్యాదు చేశారు. ‘నా భర్తను ఆమె ప్రేమ, పెళ్లి పేరుతో వేధించింది. నేను ఆత్మహత్యకు యత్నించేవరకు తీసుకెళ్లింది. బాధితురాలి తల్లి కూడా వేధించింది. నాకు, పిల్లలకు ఏమైనా అయితే వారిదే బాధ్యత. నాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జానీ మాస్టర్ 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది.
Similar News
News September 13, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,43,000గా ఉంది. రెండు రోజుల్లో కేజీ సిల్వర్‌పై రూ.3వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 13, 2025
ముంబై పేలుళ్ల కేసు.. రూ.9 కోట్లు ఇప్పించాలని నిర్దోషి డిమాండ్

2006 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయి 2015లో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ పరిహారం కోరుతూ NHRCని ఆశ్రయించాడు. కస్టోడియల్ టార్చర్ వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, రూ.9CR ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. 2015లో ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన 12 మంది నిందితులను ఈ ఏడాది జులైలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో 180+ మంది మరణించారు.
News September 13, 2025
విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు 6 లైన్ల రోడ్డు!

AP: విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.