News September 28, 2024
చెరుకుపల్లిలో వ్యక్తి దారుణ హత్య

డిండి మండలం చెరుకుపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి బండరాయితో కొట్టి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సురేశ్, ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసినవారు డిండి పోలీస్ స్టేషన్ నంబర్ల(8712670223, 8712670155)కు సమాచారం అందించాలన్నారు.
Similar News
News February 27, 2026
పుణ్యక్షేత్రాల దర్శనానికి ‘భారత్ గౌరవ్’ రైళ్లు

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మార్చి 21 నుంచి జూన్ 12 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి 6 ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహించనున్నట్లు ఐఆర్‌సీటీసీ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. రామేశ్వరం, కన్యాకుమారి యాత్రకు ₹14,700, ఉజ్జయిని, సోమనాథ్ యాత్రకు ₹17,600 టికెట్ ధరలు నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 27, 2026
జిల్లా ఆసుపత్రిలో పడిపోతున్న రక్త నిలువలు

జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు అడుగంటిపోతుండటం కలకలం రేపుతోంది. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్యాంకులో ప్రస్తుతం కేవలం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగుల అవసరాల దృష్ట్యా ఒకరికి రక్తం ఇచ్చేందుకు ఇద్దరు దాతలను కోరుతున్నా.. కొరత తీరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రోగులకు ప్రాణాపాయం తప్పదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 27, 2026
రేపటి నుంచి ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌పీవీ టీకా పంపిణీ శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 14 ఏళ్లు దాటిన ప్రతి బాలికకు ఈ టీకా వేయనున్నారు. వచ్చే 90రోజుల్లో 15 ఏళ్లు నిండే వారు కూడా ఉచితంగా టీకా పొందేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు.


