News September 28, 2024

GREAT DECISION: చెవిటి వారికీ అర్థమయ్యేలా..

image

నేషనల్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్‌లో ‘వైకల్యంతో జీవించే పిల్లల హక్కులను పరిరక్షించడం’పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రసంగిస్తున్నారు. ఇందులో CJI జస్టిస్ చంద్రచూడ్‌, కేంద్ర మంత్రి అన్నపూర్ణ పాల్గొన్నారు. అయితే మూగ, చెవిటి వారికి కూడా ఈ ప్రసంగాలు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్‌ను ఏర్పాటుచేశారు. వైకల్యంతో ఉన్న స్త్రీలలో 80% మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ నాగరత్న చెప్పారు.

Similar News

News January 1, 2026

AQI: దేశంలో హైదరాబాద్ బెస్ట్

image

దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తక్కువగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో మంగళవారం AQI 150కి పైగానే ఉండగా హైదరాబాద్‌లో 99గా నమోదైంది. ఢిల్లీలో 388, ముంబై 136, కోల్‌కతా 170, చెన్నై 186, బెంగళూరు 115, అహ్మదాబాద్‌ 164, పుణేలో 247గా ఉంది. కాలుష్యం తక్కువగా ఉండటంతో చాలా మంది హైదరాబాద్‌వైపు చూస్తున్నారు. దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.

News January 1, 2026

ఇతిహాసాలు క్విజ్ – 114

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 1, 2026

AIIMS మంగళగిరిలో 76 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>AIIMS<<>> మంగళగిరిలో 76 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MD/MS/DNB/DM/Mch, MSc, M.Biotech, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, STలకు రూ.1000. JAN 6-8వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in