News September 28, 2024

‘హైడ్రా’ వెనుకడుగు!

image

TG: ప్రజల్లో వ్యతిరేకతతో హైడ్రా కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నిన్న కూకట్‌పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో ముందస్తుగా ప్లాన్ చేసుకున్న ఇవాళ్టి కూల్చివేతల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అటు మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.

Similar News

News November 7, 2025

దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం

image

ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో శివ్ నాడార్(HCL టెక్నాలజీస్) ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708Cr విరాళం ఇచ్చినట్లు ఎడెల్‌గివ్ హురున్ వెల్లడించింది. గత ఐదేళ్లలో 4సార్లు ఆయన టాప్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ముకేశ్(₹626Cr), బజాజ్(₹446Cr), బిర్లా(₹440Cr), అదానీ(₹386Cr), నందన్(₹365Cr), హిందూజ(₹298Cr), రోహిణి(₹204Cr) ఉన్నారు. మొత్తంగా 191 మంది కుబేరులు ₹10,380Cr ఇచ్చారు.

News November 7, 2025

విద్యార్థులు తప్పక ఉచ్ఛరించాల్సిన 12 నామాలు

image

1.ఓం భారతి నమ:, 2.ఓం సరస్వతి నమ:,
3.ఓం శారదే నమ:, 4.ఓం హంసవాహినియే నమ:,
5.ఓం జగతే నమ:, 6.ఓం వాగేశ్వరి నమ:,
7.ఓం కుముదినే నమ:, 8.ఓం బ్రహ్మచారిణే నమ:,
9.ఓం బుద్ధిదాత్రే నమ:, 10.ఓం చంద్రకాంతే నమ:,
11.ఓం వార్దాయని నమ:, 12.ఓం భువనేశ్వరి నమ:
విద్యార్థులు రోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ 12 నామాలను ఉచ్ఛరిస్తే జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, విద్య, కళలు, సృజనాత్మకత పెరుగుతాయని నమ్మకం.

News November 7, 2025

HCUలో 52 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో 52 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో Asst లైబ్రేరియన్, Asst రిజిస్ట్రార్, Sr అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, Jr ఆఫీస్ అసిస్టెంట్, Lab అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, PG, బీటెక్, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://uohyd.ac.in/