News September 28, 2024

PHOTOS: కలల గూడు.. కన్నీటి గోడు

image

TG: ‘హైడ్రా’ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించడంతో చాలామంది ఇవాళ తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. వారితో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారంటూ బాధితులు గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు పైన చూడొచ్చు.

Similar News

News September 28, 2024

మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత!

image

హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్‌బొల్లాకు అండదండలు అందించాలని ఇరాన్ సుప్రీం లీడర్ హయతుల్లా అలీ ఖమేనీ పశ్చిమాసియా దేశాలను కోరారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో అమెరికా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్, లెబనాన్ ఎయిర్ స్పేస్‌లో విమానాలు ప్రయాణించకూడదని తమ పైలెట్లను ఆదేశించింది.

News September 28, 2024

CM చంద్రబాబుకు మంచు విష్ణు గిఫ్ట్

image

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన CBN చిత్రాన్ని సీఎంకు అందించినట్లు విష్ణు తెలిపారు. ఆయన తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాను నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా గురించి వివిధ విషయాల గురించి ఆయన అడిగినట్లు ట్వీట్ చేశారు.

News September 28, 2024

అద్భుతం.. కోట్ల మందిలో ఒకరికి మాత్రమే!

image

చైనాకు చెందిన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఇందులో అద్భుతమేంటి అనుకుంటున్నారా? ఆమెకు రెండు గర్భాశయాలుండగా ఒక్కొక్కరు వేర్వేరు గర్భాల నుంచి జన్మించారు. ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. ప్రపంచంలో కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితిని వైద్యులు గుర్తించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. సహజమైన గర్భధారణ ద్వారా రెండు గర్భాశయాల్లో పిండం అభివృద్ధి చెందడం చాలా అరుదని తెలిపింది.