News September 28, 2024
INDvsBAN: రెండు రోజు ఆట రద్దు

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా రెండో రోజు రద్దయింది. ఈ విషయాన్ని అంపైర్లు ప్రకటించారు. రెండో రోజూ ఒక్క బంతి కూడా పడకపోవడం గమనార్హం. కొన్ని గంటలుగా వర్షం లేకపోయినప్పటికీ నీరు ఇంకా గ్రౌండ్‌లో నిలిచి ఉంది. 3 సూపర్ సప్పర్స్ పనిచేస్తున్నా ప్రయోజనం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
Similar News
News November 12, 2025
పాక్ కోర్టు ఆవరణలో దాడి మా పనే: జమాత్ ఉల్ అహ్రార్

పాకిస్థాన్‌లోని కోర్టు ఆవరణలో <<18258453>>పేలుడు<<>> తమ పనేనని నిషేధిత ఉగ్రవాద అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. పాకిస్థాన్‌లో చట్ట వ్యతిరేక తీర్పులు జారీ చేసే జడ్జిలు, లాయర్లు, అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. దేశంలో ఇస్లామిక్ షరియా అమలులోకి వచ్చే వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ సంస్థ గతంలో TTP అనుబంధ సంస్థగా ఉంది.
News November 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 12, 2025
మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.


