News September 28, 2024
తగ్గిన వెండి ధర

రోజురోజుకూ ఎగబాకుతున్న వెండి ధరలు ఇవాళ కాస్త దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి, రూ.95,000కు చేరింది. మరోవైపు బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్లు రూ.50 చొప్పున తగ్గి రూ.77,400, రూ.70,950గా ఉన్నాయి.
Similar News
News January 15, 2026
PhonePe రూ.5వేల గిఫ్ట్.. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

సంక్రాంతి వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఓ లింక్ వైరల్‌గా మారింది. ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్- అన్ని వినియోగదారులకు రూ.5000’ అంటూ ఓ లింక్ షేర్ అవుతోంది. యూజర్లను టెంప్ట్ చేసేలా ఉన్న ఈ లింక్ ఓపెన్ చేస్తే ‘404’ అని వస్తోంది. కాగా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. డబ్బులకు ఆశపడి లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?
News January 15, 2026
ఇరాన్ పాలకులు మారితే ఇండియాకు నష్టమా?

ఇరాన్‌లో పాలనాపగ్గాలు మారితే భారత్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశం నుంచి అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఆసియాకు వెళ్లే మార్గాన్ని పాకిస్థాన్ మూసేసింది. ఇరాన్ నుంచే వెళ్తున్నాం. కొత్త పాలకులు వస్తే ఏం చేస్తారనేది సస్పెన్సే. అలాగే ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ సందిగ్ధంలో పడుతుంది. ఇరాన్ బలహీనపడితే సున్నీ మెజారిటీ ఉన్న పాకిస్థాన్ బలపడే ఛాన్సుంది.
News January 15, 2026
బీసీలకు 42% సీట్లు.. పార్టీలు ఇచ్చేనా?

TG: మున్సిపల్ ఎన్నికల్లో SC ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేశారు. BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, BRSకు ఇదో అవకాశంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్‌లో 30%(3 చోట్ల) కేటాయించింది. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.


