News September 28, 2024

లంచం అడిగిన పోలీసులు.. పాముకాటుకు చికిత్స లేటవడంతో మృతి!

image

పొలంలో పాము కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతో ఓ వ్యక్తి మరణించాడు. బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రామ్ లఖన్ ప్రసాద్ అనే వ్యక్తిని పాము కాటేయడంతో ఆస్పత్రికి పరిగెత్తాడు. మద్యం తాగి పరిగెడుతున్నాడని అనుమానించి పోలీసులు అడ్డుకున్నారు. పాము కాటు గురించి చెప్పినా నమ్మలేదు. వదిలేయాలంటే రూ.2వేలు లంచం అడగ్గా అతని సోదరుడు రూ.700 ఇచ్చి తీసుకెళ్లాడు. లేట్ అవడంతో రామ్ చనిపోయాడు.

Similar News

News October 15, 2024

ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా మెండిస్

image

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.

News October 15, 2024

ఆ కేసులను ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ చేయాలి: CM

image

AP: శ్రీసత్యసాయి(D) నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సామూహిక <<14338493>>అత్యాచారం<<>> కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసు విచారణపై అధికారులతో సమీక్షించారు. గతంలో బాపట్లలో మహిళపై సామూహిక హత్యాచారం ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు. హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు.

News October 15, 2024

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను: చంద్రబాబు

image

AP: మద్యం దుకాణాల్లో వాటాల కోసం అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం, ఇసుక విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ‘వైన్ షాపులు గెలుపొందిన వారు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వాటాల కోసం బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.