News September 28, 2024

చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్

image

వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించారు. ఈ ఏడాది పూరన్ 2,059 పరుగులు చేశారు. ఈ క్రమంలో పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(2036 రన్స్-2021)ను ఆయన అధిగమించారు. వీరిద్దరి తర్వాత అలెక్స్ హేల్స్ (1946 రన్స్-2022), జోస్ బట్లర్ (1833 రన్స్-2023) ఉన్నారు. 2022లోనూ మహ్మద్ రిజ్వాన్ (1817 రన్స్) అత్యధిక పరుగులు చేశారు.

Similar News

News September 28, 2024

IPL: ఫ్రాంచైజీ పర్స్ విలువ భారీగా పెంపు?

image

IPL 2025 కోసం BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల పర్సు విలువను రూ.115 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పర్స్ వ్యాల్యూ రూ.90 కోట్లుగా ఉండేది. నవంబర్ రెండో వారంలో 2 రోజులపాటు మెగా ఆక్షన్ జరుగుతుందని సమాచారం. మరోవైపు ఐదుగురి రిటెన్షన్‌పై మెజారిటీ ఫ్రాంచైజీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

News September 28, 2024

కంపెనీ మేనేజర్ CV రిజెక్ట్.. HR టీమ్ తొలగింపు

image

3 నెలలుగా HR టీమ్ నియామకాలు చేస్తున్నా కంపెనీలోకి క్వాలిఫైడ్ అభ్యర్థులు రాకపోవడంతో ఓ మేనేజర్ విసుగు చెందారు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకోవడానికి తన CVని పంపగా నిమిషాల్లోనే తిరస్కరణకు గురైంది. HR సిస్టమ్‌లో లోపం వల్ల ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతున్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో HR టీమ్ మొత్తాన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఉదంతాన్ని ఆయన Redditలో షేర్ చేయగా వైరలవుతోంది.

News September 28, 2024

భోజనం చేశాక ఇలా చేస్తే..

image

భోజనం చేశాక 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పేగుల్లో కదలికలు జరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే తిన్న వెంటనే కాకుండా 5-10 నిమిషాల తర్వాత నడవాలని సూచిస్తున్నారు.