News September 28, 2024

అద్భుతం.. కోట్ల మందిలో ఒకరికి మాత్రమే!

image

చైనాకు చెందిన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఇందులో అద్భుతమేంటి అనుకుంటున్నారా? ఆమెకు రెండు గర్భాశయాలుండగా ఒక్కొక్కరు వేర్వేరు గర్భాల నుంచి జన్మించారు. ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. ప్రపంచంలో కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితిని వైద్యులు గుర్తించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. సహజమైన గర్భధారణ ద్వారా రెండు గర్భాశయాల్లో పిండం అభివృద్ధి చెందడం చాలా అరుదని తెలిపింది.

Similar News

News September 28, 2024

IPL: ఆ ఆటగాళ్లకు రూ.18 కోట్లు?

image

ఒక్కో ఫ్రాంచైజీకి రిటెన్షన్ పర్స్ కింద రూ.75 కోట్ల వరకు బీసీసీఐ అనుమతించినట్లు తెలుస్తోంది. మొట్టమొదటగా రిటెన్షన్ చేసుకునే ఆటగాడికి, నాలుగో రిటెన్షన్ ఆటగాడికి రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. థర్డ్ రిటెన్షన్‌ రూ.11 కోట్లు, సెకండ్ అండ్ ఫిఫ్త్ రిటెన్షన్ ఆటగాడికి రూ.14 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.120 కోట్లలో మిగతా రూ.45 కోట్లతో మెగా వేలంలో ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.

News September 28, 2024

IPL: ఫ్రాంచైజీ పర్స్ విలువ భారీగా పెంపు?

image

IPL 2025 కోసం BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల పర్సు విలువను రూ.115 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పర్స్ వ్యాల్యూ రూ.90 కోట్లుగా ఉండేది. నవంబర్ రెండో వారంలో 2 రోజులపాటు మెగా ఆక్షన్ జరుగుతుందని సమాచారం. మరోవైపు ఐదుగురి రిటెన్షన్‌పై మెజారిటీ ఫ్రాంచైజీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

News September 28, 2024

కంపెనీ మేనేజర్ CV రిజెక్ట్.. HR టీమ్ తొలగింపు

image

3 నెలలుగా HR టీమ్ నియామకాలు చేస్తున్నా కంపెనీలోకి క్వాలిఫైడ్ అభ్యర్థులు రాకపోవడంతో ఓ మేనేజర్ విసుగు చెందారు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకోవడానికి తన CVని పంపగా నిమిషాల్లోనే తిరస్కరణకు గురైంది. HR సిస్టమ్‌లో లోపం వల్ల ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతున్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో HR టీమ్ మొత్తాన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఉదంతాన్ని ఆయన Redditలో షేర్ చేయగా వైరలవుతోంది.