News September 28, 2024

CM చంద్రబాబుకు మంచు విష్ణు గిఫ్ట్

image

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన CBN చిత్రాన్ని సీఎంకు అందించినట్లు విష్ణు తెలిపారు. ఆయన తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాను నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా గురించి వివిధ విషయాల గురించి ఆయన అడిగినట్లు ట్వీట్ చేశారు.

Similar News

News February 1, 2026

మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

image

TG: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ నిమ్స్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. JAN 24న ఇద్దరు స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సౌమ్యను కారుతో ఢీకొట్టారు. రివర్స్ తీస్తూ మరోసారి కారును ఆమెపై నుంచి తీసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి.

News February 1, 2026

ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ అరెస్ట్

image

AP: విదేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న మొహమ్మద్ ముజామిల్ అనే వ్యక్తిని చిత్తూరు-నాయుడుపేట NHపై అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా పోలీసులు వెల్లడించారు. చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో ఇతడికి సంబంధాలు ఉన్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కాగా గత నెల చిత్తూరు పర్యటనలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

News January 31, 2026

‘ధురంధర్’లో తెలుగు నటులు.. గ్రోక్ ఎంపిక ఇదే

image

‘ధురంధర్’ OTTలోకి రావడంతో నెట్టింట దానిపైనే చర్చ జరుగుతోంది. అందులోని క్యారెక్టర్లకు ఏ తెలుగు నటులు సెట్ అవుతారో చెప్పాలని ఓ నెటిజన్ ‘గ్రోక్’ను అడిగాడు. హంజా (రణ్‌వీర్ సింగ్)కు జూనియర్ ఎన్టీఆర్, రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)- రానా దగ్గుబాటి, మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)- ప్రభాస్, SP అస్లాం (సంజయ్ దత్)- వెంకటేశ్, యెలీనా (సారా అర్జున్)- సమంత, అజయ్ సన్యాల్ (మాధవన్)కు రామ్ చరణ్ అని చూపించింది.