News September 28, 2024
ఇండియాలో రూ.5,000, రూ.10,000 నోట్లను చూశారా?

ప్రస్తుతం దేశంలో రూ.2వేల నోట్లనూ వెనక్కు తీసుకోవడంతో రూ.500 నోటు అత్యధిక విలువైనదిగా ఉంది. కానీ 1938లో RBI తొలిసారి రూ.10,000, రూ.5,000 నోట్లనూ ముద్రించింది. వీటిని వ్యాపారులు ఎక్కువగా ఉపయోగించేవారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1946లో పెద్ద నోట్లను రద్దు చేసింది. 1954లో స్వతంత్ర భారతదేశంలో వాటిని ప్రవేశపెట్టి, 1978లో రద్దు చేశారు.
Similar News
News November 12, 2025
బాబర్ ఖాతాలో చెత్త రికార్డు

పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం ఫ్లాప్ షో కొనసాగుతోంది. సెంచరీ చేయకుండా అత్యధిక వన్డేలు ఆడిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ(83)ని సమం చేశారు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ప్లేయర్ జయసూర్య(88) తొలి స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ చందర్‌పాల్(78) వీరి తర్వాతి స్థానంలో ఉన్నారు. నిన్న SLతో జరిగిన మ్యాచులో బాబర్ 51 బంతుల్లో 29 పరుగులు చేశారు. చివరగా 2023 ఆసియాకప్‌లో నేపాల్‌పై సెంచరీ బాదారు.
News November 12, 2025
మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

‘టాటా’ టూవీలర్ వాహనాలను తయారు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. సదరు కంపెనీ 125సీసీ బైక్‌ను రూ.60వేలకే అందిస్తోందని, ఇది 90కి.మీ మైలేజీ ఇస్తోందంటూ ఇటీవల కొన్ని వెబ్సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో టాటా క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.
News November 12, 2025
బంద్ ఎఫెక్ట్.. విద్యార్థులకు షాక్!

TG: ప్రైవేట్ కాలేజీల <<18182444>>బంద్<<>>తో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసింది. కాగా దీనిపై సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తామని FATHI తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 3 నుంచి 4 రోజుల పాటు ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.


