News September 28, 2024

MNCL: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట సంతోష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారంతో వ్యభిచారం నిర్వహిస్తున్న తోట మహేందర్, ఓ మహిళ, విటుడు బోలెం శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

Similar News

News February 25, 2026

కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం: ఆదిలాబాద్ MLA

image

విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

News February 24, 2026

ఆదిలాబాద్: లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

image

జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు ఎక్కువ పరిష్కరించేలా దృష్టి పెట్టాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్ రావు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు హల్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

News February 24, 2026

ఆదిలాబాద్: కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పాలన అధికారులు

image

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా సేవలందించిన వారిని గ్రామ పాలన అధికారులుగా నియమించి గ్రామ స్థాయిలో జరిగే అంశాలను ప్రభుత్వానికి అందజేస్తూన్నట్లు తెలిపారు.