News September 28, 2024

మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు: సీఎం రేవంత్

image

TG: ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒకే కార్డులో రేషన్, హెల్త్, ఇతర పథకాల వివరాలన్నీ ఉంటాయని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులను గుర్తిస్తామని చెప్పారు.

Similar News

News September 29, 2024

ఆ ముగ్గురికీ బీసీసీఐ మొండిచేయి!

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు చోటు దొరకలేదు. దీనిపై వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. బీసీసీఐ రాజకీయాల వల్ల వీరి కెరీర్ దెబ్బతింటోందని వాపోతున్నారు. సరైన కారణాలు లేకుండా కావాలనే వీరికి జట్టులో చోటు కల్పించట్లేదని ఆరోపిస్తున్నారు. జట్టులోకి రావాలంటే వారు ఇంకేం చేయాలని ప్రశ్నిస్తున్నారు.

News September 29, 2024

పురావస్తు శాఖపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

image

ఢిల్లీలోని జామా మసీదును రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించకూడదన్న సంబంధిత ఫైల్‌ను సమర్పించడంలో పురావస్తు శాఖ విఫలమైందని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. మసీదును ASI పరిధిలోకి తెస్తే ప్రభుత్వ పర్యవేక్షణ అధికమవుతుంది. దీంతో అలాంటి నిర్ణయం తీసుకోబోమని నాటి ప్రధాని మన్మోహన్ 2004లో షాహీ ఇమామ్‌కు హామీ ఇచ్చారు. దీన్ని ASI కూడా అంగీకరించింది. అయితే, సంబంధిత పత్రాలను సమర్పించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

News September 29, 2024

హ‌స‌న్ న‌స్ర‌ల్లా మ‌ర‌ణం.. ఒక రోజు ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముఫ్తీ దూరం

image

పాలస్తీనా, లెబనాన్‌కు పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ సంఘీభావం ప్ర‌క‌టించారు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ఇత‌ర అమ‌ర‌వీరులకు ఆమె సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తాను జమ్మూకశ్మీర్‌లో ఒక‌రోజు ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉండ‌నున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో తాము పాల‌స్తీనా, లెబ‌నాన్‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని పేర్కొన్నారు.