News September 28, 2024

మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు?: కేటీఆర్

image

TG: మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లా అని KTR ప్రశ్నించారు. ‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలుపెట్టింది కాంగ్రెస్. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? CMకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ? మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 29, 2024

తిరుమలలో చిరుత కలకలం

image

AP: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డులు టీటీడీ అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా గతంలోనూ తిరుమలలో సంచరించిన చిరుత ఓ చిన్నారిని చంపిన విషయం తెలిసిందే.

News September 29, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో ఇవాళ HYD, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అటు APలోని మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, YSR, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది.

News September 29, 2024

AP TET: 94.30% హాల్ టికెట్లు డౌన్ లోడ్

image

AP: అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగే TET-2024(జులై)కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 94.30% మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. హాల్ టికెట్లలో తప్పులుంటే పరీక్షా కేంద్రాల వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించి నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని సూచించింది. వివరాలకు 9398810958, 6281704160, 8121947387 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది.