News September 29, 2024

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

image

గుండె జబ్బులు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని WHO, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 1946లో జెనీవాలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో తొలిసారిగా వరల్డ్ హార్ట్ డే నిర్వహించారు. అలా 2000 నుంచి 2010 వరకు సెప్టెంబరులో చివరి ఆదివారం నిర్వహిస్తూ వచ్చారు. 2011 నుంచి SEP 29న జరుపుతున్నారు.

Similar News

News September 29, 2024

‘సత్యం సుందరం’ వచ్చేది ఈ ఓటీటీలోనే

image

అరవింద్ స్వామి, కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ’96’ మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కొన్ని వారాల తర్వాత అందులో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించగా, సూర్య-జ్యోతిక నిర్మించారు.

News September 29, 2024

IPL: అలాంటి ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం

image

ఐపీఎల్ వేలం కోసం రిజస్టర్ చేసుకుని, సెలక్ట్ అయిన ప్లేయర్లు కచ్చితంగా టోర్నీలో ఆడాలని <<14222929>>ఐపీఎల్<<>> గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ ఆటగాళ్లపై రెండు సీజన్ల పాటు నిషేధం విధించనున్నట్లు పేర్కొంది. అలాగే ఓవర్సీస్ ప్లేయర్లు బిగ్ ఆక్షన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, లేదంటే వచ్చే ఏడాది వేలానికి వారు అర్హులు కారని తెలిపింది.

News September 29, 2024

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కేసు

image

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా, అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీంతో 16063/IN/224 కింద రంగనాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. కాగా బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.