News September 29, 2024
TDP ఉభయ గోదావరి జిల్లాల MLC అభ్యర్థి ఖరారు..?

TDP ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. కాపు లేదా SC సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి జవహర్‌తో పాటు పలువురి పేర్లు పరిశీలించినా, చివరికి ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్‌కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐ.పోలవరానికి చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశించగా జనసేనకు ఇచ్చారు.
Similar News
News August 21, 2025
రాజమండ్రి: ఎక్కడా ఇసుక కొరత లేదు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఎక్కడ ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్ల వద్ద సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక కోసం ప్రజలు, కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణాలు చేపట్టే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
News August 21, 2025
ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ఎత్తివేత

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి నీటిమట్టం 12.90 అడుగులకు చేరడంతో జల వనరుల శాఖ అధికారులు బ్యారేజీలోని 175 గేట్లను ఎత్తి, 11.51 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.
News August 21, 2025
తూ.గో: నిర్మానుష్య ప్రదేశాలలో డ్రోన్ నిఘా

జిల్లాలో బహిరంగ మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, పాడుబడిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని ఆయన చెప్పారు.