News September 29, 2024

అరకులో పాస్ పోర్టు ఆఫీస్..!

image

అరకులోయలో పాస్ పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ సంజయ్ పాండా తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని ఉప తపాలా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు పాస్ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఉప తపాలా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.

Similar News

News January 8, 2026

విశాఖ మీదుగా వెళ్లే ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’ రీషెడ్యూల్

image

కన్యాకుమారి – దిబ్రూగఢ్ వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22503) నేడు (08.01.2026) రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతోంది. దీనివల్ల రేపు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు సుమారు 4 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

News January 8, 2026

విశాఖలో రేపటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్‌

image

విశాఖలోని రేపటి నుంచి రెండు రోజులు పాటు లైట్ హౌస్ ఫెస్టివల్ పేరిట కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ వెల్లడించారు. ఎంజీఎం పార్కు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ ఫెస్టివల్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

News January 8, 2026

విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

image

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.