News September 29, 2024

ఇజ్రాయెల్ లెక్క సరి చేసింది: నెతన్యాహు

image

హెజ్బొల్లా చీఫ్ న‌స్ర‌ల్లా మ‌ర‌ణంతో ఇజ్రాయెల్ ‘లెక్క సరి’ చేసింద‌ని ఆ దేశ ప్రధాని నెత‌న్యాహు పేర్కొన్నారు. న‌స్ర‌ల్లా మ‌ర‌ణం అనంతరం ఆయ‌న మొద‌టిసారి ప్ర‌క‌టన ఇచ్చారు. ఎంద‌రో ఇజ్రాయెలీలు, అమెరిక‌న్లు, ఫ్రెంచ్ పౌరుల హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన సామూహిక హంత‌కుడిని అంతం చేసి ఇజ్రాయెల్ లెక్క సరి చేసిందన్నారు. తమ లక్ష్య సాధనకు న‌స్ర‌ల్లా మరణం అవసరమని పేర్కొన్న నెతన్యాహు ఇదొక చారిత్రక మ‌లుపుగా అభివ‌ర్ణించారు.

Similar News

News November 9, 2025

రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన.. సీఎంతో భేటీ!

image

AP: రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రెండు బృందాలుగా ఏర్పడి పరిశీలించనుంది. రేపు టీం-1: ప్రకాశం, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నష్టాలను అంచనా వేయనుంది. ఎల్లుండి టీం-1: బాపట్ల, టీం-2: కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

News November 9, 2025

టీ20 WC వేదికలు ఖరారు?

image

ICC మెన్స్ T20 వరల్డ్ కప్-2026 వేదికలు ఖరారైనట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో, కాండీలో మ్యాచులు జరగనున్నట్లు Cricbuzz పేర్కొంది. అహ్మదాబాద్, కోల్‌కతాలో సెమీ ఫైనల్స్ జరుగుతాయని, ఫైనల్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. SL లేదా PAK ఫైనల్ చేరితే కొలంబోలో ఫైనల్ జరిగే అవకాశముంది. FEB 7న టోర్నీ ప్రారంభమయ్యే ఛాన్సుంది.

News November 9, 2025

రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవచ్చా?

image

రోడ్డు పక్కన ఇంటి నిర్మాణాలు ఎలా ఉండాలో వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవాలంటే స్థానిక సంస్థల అనుమతి ఉండాలి. రోడ్డు వెడల్పును బట్టి ఎత్తు పరిమితిని నిర్ణయిస్తారు. వాస్తు శాస్త్రం కూడా దీనిని నిర్ధారిస్తుంది. అయితే ఇంటికి రోడ్డుకు మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండాలి. గాలి, వెలుతురు ఇంట్లోకి రావడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి’ అని ఆయన చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>