News September 29, 2024
శ్రీకాకుళం: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

దసరా పండగ ముంగిట నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. నూనె లీటర్ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి కేజీ రూ.60కి తగ్గడం లేదు. ధరలు భారీగా పెరగడంతో ఏదీ కొనలేక పోతున్నామని ప్రజలు అంటున్నారు.
Similar News
News September 15, 2025
శ్రీకాకుళం-విశాఖకు ఈ రైళ్లు నడవనున్నాయి

శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. విశాఖ-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. మరలా సేవలను పునరుద్ధరించినట్లు తాజాగా వెల్లడించింది. పలాస-విశాఖ(67290) మెము రైలును విశాఖ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవి శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లు మీదుగా నడవనున్నాయి.
News September 15, 2025
సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోల్ మంత్రి, కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అభివృద్ధి పదం వైపు నడుస్తున్న రాష్ట్రాన్ని, జిల్లాలను అధికారులు సమన్వయంతో పనిచేసే మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 15, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 81 అర్జీలు స్వీకరించామన్నారు. ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.